- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Delhi Air Pollution : ఈ నెల 17న ఢిల్లీ-ఎన్‌సీఆర్ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు విచారణ
గత కొద్ది రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమస్యపై ఇప్పటికే పార్లమెంట్ లో చర్చ పెట్టాలని ప్రతిపక్షాల డిమాండ్ చేయగా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air pollution in Delhi) విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమస్యపై ఇప్పటికే పార్లమెంట్ లో చర్చ పెట్టాలని ప్రతిపక్షాల డిమాండ్ చేయగా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అలాగే పలువురు ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్)లో తీవ్రమవుతున్న వాయు కాలుష్య సంక్షోభంపై విచారించాలని సుప్రీం కోర్టు (Supreme Court)లో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను డిసెంబర్ 17వ తేదీన విచారణకు స్వీకరిస్తామని సుప్రీంకోర్టు ఈ రోజు (సోమవారం) తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్‌మాల్య బాగ్చి, విపుల్ ఎం పంఛోలిలతో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని పరిశీలించింది.
కోర్టుకు అమికస్ క్యూరీ (న్యాయ సహాయకురాలు)గా వ్యవహరిస్తున్న సీనియర్ న్యాయవాది అపరాజిత సింగ్ ముఖ్యమైన వాదనలు వినిపించారు. నివారణ చర్యలు ఇప్పటికే ఉన్నప్పటికీ, అధికారులచే వాటి అమలు సరిగా జరగకపోవడం ప్రధాన సమస్యగా ఉందని వారు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు అధికారులు ఉన్న ప్రోటోకాల్స్‌ను కూడా పాటించడం లేదని సింగ్ పేర్కొన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సీజేఐ, ఈ కేసు డిసెంబర్ 17 (బుధవారం)న ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందు విచారణకు వస్తుందని స్పష్టం చేశారు.
ఢిల్లీలో వాయు కాలుష్యం.. సుప్రీంకోర్టు సీజేఐ కీలక నిర్ణయం
ఢిల్లీ ఎయిర్‌పోర్టును కమ్మేసిన పొగమంచు.. లో విజిబిలిటీతో 40 విమానాలు రద్దు






