- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ ఎయిర్‌పోర్టును కమ్మేసిన పొగమంచు.. లో విజిబిలిటీతో 40 విమానాలు రద్దు
ఓ వైపు వాయు కాలుష్యంతో జనం సతమతమవుతుంటే దేశ రాజధాని ఢిల్లీ (Delhi)ని ఇవాళ దట్టమైన పొగమంచు కమ్మేసింది.

దిశ, వెబ్‌డెస్క్: ఓ వైపు వాయు కాలుష్యంతో జనం సతమతమవుతుంటే దేశ రాజధాని ఢిల్లీ (Delhi)ని ఇవాళ దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (Indira Gandhi International Airport) పరిధిలో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటి వరకు లో విజిబిలిటీ (Low visibility) కారణంగా సుమారు 40 విమానాలు రద్దు కాగా, మరో 4 విమానాలు దారి మళ్లించారు. ఉదయం నుంచి ఢిల్లీ-ఎన్‌సీఆర్ (Delhi-NCR) ప్రాంతంలో విజిబిలిటీ కనిష్టంగా 50 మీటర్లకు పడిపోయింది. ఈ శీతాకాలంలో ఫస్ట్ టైమ్ భారీగా పొగమంచు నమోదైంది. తాజా పరిణామంతో ఇండిగో, ఎయిరిండియా, స్పైస్‌జెట్ వంటి ప్రముఖ విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీలు జారీ చేశాయి. దట్టమైన పొగమంచు కారణంగా ఫ్లైట్ ఆపరేషన్స్‌లో సమస్య తలెత్తుతున్నాయని.. ఎయిర్‌పోర్టుకు బయలుదేరే ముందు ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోవాలని సూచించాయి.
ప్రధాని మోడీ పర్యటనలో జాప్యం..
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పొగమంచు కారణంగా పలు విమానాలు ఇప్పటకే రద్దు కాగా.. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) మూడు దేశాల పర్యటనలో జాప్యం ఏర్పడింది. నేటి నుంచి ఈనెల 18 వరకు జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటించబోతున్నారు.






