సెలవుల్లో సుమారు 40 వేల కేసులపై సుప్రీంకోర్టు విచారణ!

by Phanindra |

సెలవుల్లో సుమారు 40 వేల కేసులపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. అందరు జడ్జీలు ఈ ఆరు వారాల్లో బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

సెలవుల్లో సుమారు 40 వేల కేసులపై సుప్రీంకోర్టు విచారణ!
X

దిశ, నేషనల్ బ్యూరో: వేసవి సెలవుల్లో సుప్రీంకోర్టు 38,739 కేసులపై విచారణ చేపట్టనుంది. మే 25 నుంచి జులై 14 వరకు అత్యు్న్నత న్యాయస్థానం పాక్షికంగానే పనిచేయనుంది. ఈ సమయంలో 17,088 సాధారణ హియరింగ్ అంశాలు, 21,651 ఇతర విషయాల కేసులపై విచారణ జరపనున్నట్లు సుప్రీంకోర్టు సర్క్యులర్ విడుదల చేసింది. ఈ సమయంలో 29 మంది జడ్జీలు సుప్రీంకోర్టులో విధులు నిర్వర్తించనున్నారు. వచ్చే ఆరు వారాల్లో ఇద్దరు జడ్జీలతో కూడిన మూడు ధర్మాసనాలు ఈ కేసుల్లో వాదనలు వింటాయి. వారం వారం ధర్మాసనంలో జడ్జీలు మారుతుంటారు. దీంతో పాక్షిక పని దినాల్లో కూడా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీలు అందరికీ ప్రాతినిధ్యం లభించనుంది.

సుప్రీంకోర్టు కొలీజియం న్యాయమూర్తులు సీజేఐ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ బీవీ నాగరథ తొలి వారంలోనే తమ బాధ్యతలు నిర్వర్తిస్తారు. వీరు జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మాసి, జస్టిస్ దీపంకర్ దత్త, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కలిసి ఇద్దరిద్దరుగా ధర్మాసనం బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

Next Story