- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వక్షోజాలను పట్టుకోవడం అత్యాచారం కాదు

- అది అత్యాచార ప్రయత్నం కాదని తీర్పిచ్చిన హైకోర్టు
- మనిషి గౌరవానికి భంగం కలిగించడం మాత్రమే అని వ్యాఖ్య
- హైకోర్టు తీర్పుపై సుప్రీంలో పిటిషన్ దాఖలు
- అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో నేడు విచారణ
దిశ, నేషనల్ బ్యూరో: వక్షోజాలను పట్టుకోవడం, పైజామా తాడును తెంపడం వంటివి అత్యాచారయత్నం కిందకు రావని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సుప్రీంకోర్టు మంగళవారం పరిశీలించింది. మైనర్‌పై అత్యాచారయత్నానికి సంబంధించిన కేసులో మార్చి 17న అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.కాగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టనుంది. బాధితురాలి వక్షోజాలను పట్టుకొని, పైజామా నాడాను తెంపాడనే ఆరోపణలు నిందితుడు అత్యాచారయత్నానికి పాల్పడినట్లుగా పరిగణించబడదని అలహాబాద్ హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇది కేవలం లైంగిక వేధింపుల ఆరోపణ మాత్రమే అని వ్యాఖ్యానించింది.
11 ఏళ్ల బాలికపై జరిగిన ఈ సంఘటనకు సంబంధించి. ఒక మహిళ గౌరవంపై దాడి కేసు అని ఇది అత్యాచారయత్నం అని చెప్పలేమని జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్ర తీర్పు ఇచ్చారు. మార్చి 17నాటి ఆ తీర్పులోని వివాదాస్పద భాగాన్ని తొలగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. భవిష్యత్‌లో న్యాయమూర్తులు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా నిరోధించడానికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషన్‌లో డిమాండ్ చేశారు. కాగా, ఈ తీర్పుతో పూర్తిగా విభేదిస్తున్నానని కేంద్ర మంత్రి అన్నపూర్ణా దేవి అన్నారు. సుప్రీంకోర్టు తప్పకుండా దీనిపై జోక్యం చేసుకోవాలని కోరారు.