- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Supreme Court: ఈడీ తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం.. సంచలన వ్యాఖ్యలు
ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో జరిగిన రూ.2 వేల కోట్ల మద్యం కుంభకోణానికి సంబంధించి ఇవాళ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court)లో మరోసారి విచారణ చేపట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో జరిగిన రూ.2 వేల కోట్ల మద్యం కుంభకోణానికి సంబంధించి ఇవాళ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court) మరోసారి విచారణ చేపట్టింది. ఈ మేరకు విచారణ సందర్భంగా ఈడీ (Enforcement Directorate) తీరుపై జస్టిస్ అభయ్ ఎస్.ఓకా (Justice Abhay S. Oka), జస్టిస్ ఉజ్జల్ భుయాన్ (Justice Ujjal Bhuyan)లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతి కేసులో నిందితులు సుదీర్ఘంగా కస్టడీలో ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యంగా మనీ లాండరింగ్ (Money Laundering) కేసులలో ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండానే ఈడీ అధికారులు అరెస్టులు చేస్తున్నారని ఆరోపించింది. ఇక ఛత్తీస్‌గఢ్ లిక్కర్ స్కామ్ (Chhattisgarh Liquor Scam) కేసులో ఒక్క పైసా కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా అధికారులు చూపించ లేకపోయారని వ్యాఖ్యానించింది. అదేవిధంగా గతంలోనూ అనేక కేసుల్లో ఈడీ ఆధారాలను చూపించలేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతీ స్కామ్‌లో అధికారుల తీరు ఇలానే ఉందని.. వారికి కేవలం అరెస్టులు చేయడమే అలవాటుగా మారిపోయిందని ధర్మాసనం ఓ రేంజ్‌లో ఫైర్ అయింది.






