- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నటుడు దర్శన్‌కు బెయిల్ ఇవ్వడంపై కర్ణాటక హైకోర్టుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
కన్నడ హీరో దర్శన్‌కు బెయిల్ మంజూరు చేయడంతో కర్నాటక హైకోర్డుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అభిమాని రేణుక స్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన దర్శన్, పవిత్ర గౌడ్ మరికొందిరికి హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వగా,

దిశ, వెబ్ డెస్క్: కన్నడ హీరో దర్శన్‌కు బెయిల్ మంజూరు చేయడంతో కర్నాటక హైకోర్డుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అభిమాని రేణుక స్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన దర్శన్, పవిత్ర గౌడ్ మరికొందిరికి హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వగా, డిసెంబర్ 13న రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కర్నాటక ప్రభుత్వం బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరగ్గా హైకోర్టు చేసిన తప్పునే తాము పునరావృతం చేయబోమని ఆగ్రహం వ్యక్తం చేసింది. తీర్పు ఇవ్వడం ఆమెదయోగ్యమైంది కాదని సుప్రీం మండిపడింది. దీంతో వీళ్లు దోషులా లేదా నిర్దోషులా అనేది తాము ఇప్పుడే తీర్పు ఇవ్వమని పవిత్ర గౌడ తరపు లాయర్‌కు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే రేణుక స్వామి మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.






