- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘థగ్ లైఫ్’కు బెదిరింపులపై సుప్రీంకోర్టు సీరియస్.. కమల్ క్షమాపణలు చెప్పక్కర్లేదు!
‘థగ్ లైఫ్’కు బెదిరింపులపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. కమల్ క్షమాపణలు చెప్పక్కర్లేదని, బెదిరించిన వారిని ఆపాల్సింది రాష్ట్ర సర్కారే అని స్పష్టం చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: ‘థగ్ లైఫ్’ సినిమా స్క్రీనింగ్ అడ్డుకుంటామని వస్తున్న బెదిరింపులపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని నిలదీసిన సుప్రీంకోర్టు.. ఇలా బెదిరిస్తున్న వారిని అడ్డుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తేల్చిచెప్పింది. దీంతో సినిమా విడుదలకు పూర్తి సహకారం అందిస్తామని, పోలీసు భద్రత కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ప్రొ-కన్నడ గ్రూపులకు కూడా కర్ణాటక పోలీసులు నోటీసులు జారీ చేయడం గమనార్హం.
అదే సమయంలో తమిళ్ నుంచే కన్నడ పుట్టిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమల్ హాసన్ ఎలాంటి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇటీవలి కాలంలో ప్రజలు భావాలు దెబ్బతింటున్న ఘటనలు మరీ ఎక్కువైపోయాయన్న కోర్టు.. ‘ఒక అభిప్రాయం వల్ల ఒక సినిమానో, ఒక స్టాండప్ కామెడీ షోనో ఎలా ఆపేస్తారు? ఇలాంటి జరగకుండా చూసుకోవాలి’ అని తెలిపింది. కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో తను సంతృప్తి చెందానని కమల్ హాసన్ చెప్పారు. అయితే ఈ కేసు వేసిన అసలు పిటిషనర్ మాత్రం.. బెదిరించిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా మార్గదర్శకాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.






