వరకట్నాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

వివాహాల కోసం వరకట్నాలు తీసుకోవడంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పవిత్రమైన వివాహ వ్యవస్థ కట్నాలతో కమర్షియల్ గా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది.

వరకట్నాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ‌, వెబ్ డెస్క్: వివాహాల కోసం వరకట్నాలు తీసుకోవడంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పవిత్రమైన వివాహ వ్యవస్థ కట్నాలతో కమర్షియల్ గా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది. పరస్పర విశ్వాసం, నమ్మకం, గరవంపై నిర్మితమైన వివాహ వ్యవస్థ ఇటీవలి కాలంలో వాణిజ్య లావాదేవీగా మారడం విచారకరం అని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్.మహదేవన్ ల ధర్మాసనం పేర్కొంది. పెళ్లైన నాలుగు నెలలకే భార్యకు విషం ఇచ్చి చంపిన భర్తకు అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సుప్రీం తప్పుపట్టింది.

నేర తీవ్రతను, బాధితురాలి వాంగ్మూలాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేని పేర్కొంది. వరకట్న మరణం ఒక వ్యక్తిపై మాత్రమే కాకుండా సమాజం మొత్తంపై జరిగిన నేరం అని వ్యాఖ్యానించింది. కానుకలు, బహుమతుల పేరుతో ఇచ్చే వరకట్నం సామాజిక హోదాను చూపించుకునే ప్రయత్నం అని అభిప్రాయపడింది. వరకట్నం సామాజిక దురాచారం అని వివాహ వ్యవస్థను భ్రష్టుపట్టించి మహిళలను అణచివేతుకు గురిచేస్తోందని తెలిపింది.

ఇది క్రూరంగా మారి నవవధువుల మరణాలకు కారణమవుతోందని తెలిపింది. గొంతెమ్మ కోర్కెలు తీర్చలేని ఒకే ఒక్క కారణంతో అత్తింట్లో కోడలి జీవితం బలైపోతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆర్టికల్ 14,ఆర్టికల్ 21 హక్కులను ఇది హరిస్తోందని తెలిపింది. న్యాయవ్యవస్థ ఇలాంటి వాటిని ఉపేక్షించి వదిలిపెడితే నేరాలు చేసేవారికి ధైర్యం ఇచ్చినట్టు అవుతుందని కాబట్టి న్యాయవ్యవస్థ స్పందన బలంగా ఉండాలని చెప్పింది.

Next Story