- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆమె కోరికలు పెద్దవి, భరించలేరు.. పెళ్లైన ఏడాదికే విడాకులు కోరిన భార్యపై సుప్రీం సీరియస్
పెళ్లైన ఏడాదికే భర్తతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న భార్య కోరికలు చూసి ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానమే ఖంగుతిన్నది. పెళ్లైన ఏడాదికే ఓ జంట విడాకుల కోసం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. అయితే విచారణ సందర్భంగా భార్య కోరికలు చూసి సుప్రీంకోర్టు జడ్జి పార్దివాలా షాక్ అయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: పెళ్లైన ఏడాదికే భర్తతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న భార్య కోరికలు చూసి ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానమే ఖంగుతిన్నది. పెళ్లైన ఏడాదికే ఓ జంట విడాకుల కోసం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. అయితే విచారణ సందర్భంగా భార్య కోరికలు చూసి సుప్రీంకోర్టు జడ్జి పార్దివాలా షాక్ అయ్యారు. భర్త నుండి విడాకులతో పాటు తనకు రూ.5 కోట్లు భరణంగా కావాలని మహిళ డిమాండ్ చేసింది. భర్త రూ.35 నుండి రూ.40 లక్షలు ఇవ్వగలనని చెప్పగా ఆ ఆఫర్ ను తిరస్కరించింది.
అంతే కాకుండా విచారణ సందర్భగా భార్త తరుపు న్యాయవాది మాట్లాడుతూ.. వారిద్దరినీ కలిపేందుకు ప్రయత్నించామని, కానీ ఆమె నిరాకరించారని చెప్పారు. దీంతో జడ్జి పార్దివాలా మాట్లాడుతూ... ఆమెను తిరిగి ఆహ్వానించడం ద్వారా మీరు తప్పు చేస్తున్నారని అన్నారు. ఆమెను మీరు ఉంచుకోలేరని, ఆమె కలలు చాలా పెద్దవని సూచించారు. ఏడాది వివాహ బంధాన్ని ముగించడానికే రూ.5 కోట్లు డిమాండ్ చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇరువురు సుప్రీంకోర్టు సెంటర్లలో ఒక ఒప్పందానికి వచ్చి అక్టోబర్ 5న ఉదయం 11.30 నిమిషాలకు తిరిగి కోర్టులో హాజరవ్వాలని మళ్లీ అలాంటి డిమాండ్లే చేస్తే చాలా కఠినమైన ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని భార్యను హెచ్చరించారు.





