- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కల్నల్‌పై వివాదాస్పద వ్యాఖ్యల కేసు: మంత్రి వివరణపై సుప్రీం సీరియస్
యూనిఫామ్ లో మహిళలను అవమానించినందుకు క్షమాపణ చెప్పాలని నాలుగురోజుల క్రితం ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ ఆదేశించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించిన వివరాలు వెల్లడించిన కల్నల్ సోఫియా ఖురేషిపై (Sofia Qureshi) మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా (Vijay Shah) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దేశానికే తలవంపులు తెచ్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు (Supreme Court)మండిపడింది. తనపై నమోదైన కేసుని కొట్టివేయాలంటూ విజయ్ షా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఒక లేడీ ఆఫీసర్ ను అవమానించేలా వ్యాఖ్యలు చేసి.. ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారా ? అని ప్రశ్నించింది.
యూనిఫామ్ లో మహిళలను అవమానించినందుకు క్షమాపణ చెప్పాలని నాలుగురోజుల క్రితం ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ ఆదేశించారు. ఎక్కడా క్షమాపణలు చెప్పకుండానే మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కల్నల్ పై చేసిన వ్యాఖ్యలపై ఆయన ఇచ్చిన వివరణతో సుప్రీం ధర్మాసనం సంతృప్తి చెందలేదు. ఆయన అరెస్ట్ పై స్టే విధించిన కోర్టు.. దర్యాప్తుకు సహకరించాలని ఆదేశించింది.
ఈ కేసు దర్యాప్తుకు ఐజీపీ నేతృత్వంలో రాష్ట్రానికి సంబంధించిన ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో మంగళవారం ఉదయం 10 గంటల్లోగా ప్రత్యేక సిట్ ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ డీజీపీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ టీమ్ లో ఒక మహిళా అధికారి కూడా ఉండాలని స్పష్టం చేసింది. సిట్ అధికారుల బృందం కేసు దర్యాప్తు చేసి నివేదికను సమర్పించాలని, తదుపరి విచారణను మే 28కి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కే సింగ్ ల ద్విసభ్య ధర్మాసనం తెలిపింది.






