"కొంత మందిని జైలుకు పంపాలి".. పంట వ్యర్థాలు తగలబెట్టడంపై సుప్రీంకోర్టు సీరియస్

by Ajay Maddhiboyina |

ఉత్త‌రాది రాష్ట్రాల్లో పంట వ్య‌ర్థాల‌ను త‌గ‌ల‌బెట్ట‌డంపై సుప్రీంకోర్టు సీరియ‌స్ అయ్యింది. నిబంధ‌నలు ఉల్లంగించేవారిపై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని అధికారుల‌ను ప్ర‌శ్నించింది. ప్ర‌ధాన న్యాయ‌మూర్తి బీఆర్ గ‌వాయ్ పంట వ్య‌ర్థాల‌ను పొలాల్లో త‌గ‌ల‌బెట్ట‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కొంత మందిని జైలుకు పంపాలి.. పంట వ్యర్థాలు తగలబెట్టడంపై సుప్రీంకోర్టు సీరియస్
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్త‌రాది రాష్ట్రాల్లో పంట వ్య‌ర్థాల‌ను త‌గ‌ల‌బెట్ట‌డంపై సుప్రీంకోర్టు సీరియ‌స్ అయ్యింది. నిబంధ‌నలు ఉల్లంగించేవారిపై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని అధికారుల‌ను ప్ర‌శ్నించింది. ప్ర‌ధాన న్యాయ‌మూర్తి బీఆర్ గ‌వాయ్ పంట వ్య‌ర్థాల‌ను పొలాల్లో త‌గ‌ల‌బెట్ట‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేవ‌లం అప్పీళ్లు ఈ విధానాన్ని నిరోధించ‌లేవ‌ని అన్నారు. ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించ‌డానికి క‌ఠిన చ‌ర్య‌లు అస‌వ‌రం అని అభిప్రాయ‌ప‌డ్డారు. జ‌రిమానా ఎందుకు విధించ‌డం లేద‌ని, కొంత‌మందిని జైలుకు పంపిస్తే మిగితావారిలో మార్పు వ‌స్తుంద‌ని పేర్కొన్నారు. కాలుష్యాన్ని అరిక‌ట్టాల‌ని ఉద్దేశ్యం ఉంటే జ‌రిమానాలు విధించ‌డానికి ఎందుకు వెన‌కాడుతున్నార‌ని ప్ర‌శ్నించారు. పంట కోసిన త‌ర‌వాత దానిని జీవ ఇంధ‌నంగా, ఎరువుగా ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని నివేధిక‌లు చెబుతున్నాయ‌ని పేర్కొన్నారు.

Next Story