- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Supreme Court: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం దుర్వినియోగం అవుతోంది.. సుప్రీం ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ (SC, ST Atrocity) కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court) సంచలన వ్యాఖ్యలు చేసింది. కులం పేరుతో దూషించాడని నిరూపించేందుకు నిందితుడు ప్రజా క్షేత్రంలో బహిరంగంగా బాధితుడిని దూషించినట్లుగా నిరూపించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అందుకు సంబంధించి నమోదైన ఓ కేసును కొట్టి వేస్తూ తీర్పును వెలువరించింది. 1989లోని సెక్షన్ 3(1)(ఆర్) కింద నేరం రుజువు కావాలంటే ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తిని నిందితుడు ఉద్దేశపూర్వకంగా ప్రజా సమక్షంలో బహిరంగంగా అవమానించినట్లు కానీ, బెదిరించినట్లు కానీ నిరూపించాల్సి ఉంటుందని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. రక్షణ కోసం తెచ్చిన ఈ చట్టాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని కోర్టు మండి పడింది.
ఓ కేసులో దళితుడిని దూషించిన ఘటన నాలుగు గోడల మధ్య జరిగింది. ఆ తర్వాత ఫిర్యాదుదారుడి సహచరులు ఘటనా స్థలానికి చేరుకున్నారని ఎఫ్ఐఆర్‌లో పోలీసులు వెల్లడించాడన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. కేసుకు కారణమైన ఘటన అందరూ చూస్తుండగా బహిరంగ ప్రదేశంలో జరగలేదని పేర్కొన్న జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్‌తో కూడిన ధర్మాసనం కేసును కొట్టివేసింది. అట్రాసిటీ చట్టంలోని సెక్షన్ 3(1) (ఎస్) కింద నేరం రుజువు కావాలంటే ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తిని బహిరంగ ప్రదేశంలో కులం పేరుతో దూషించి ఉండాలని స్పష్టం చేసింది.






