ఓటర్ల లిస్టు ప్రచురణపై మధ్యంతర స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ

by Phanindra |

ఓటర్ల లిస్టు ప్రచురణపై మధ్యంతర స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆధార్, ఓటర్ కార్డులను కూడా అంగీకరించాలని ఈసీకి సూచించింది.

ఓటర్ల లిస్టు ప్రచురణపై మధ్యంతర స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌లో డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్స్ ప్రచురణపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. బిహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై పిటిషన్లన్నింటిపై జులై 29న తుది విచారణ జరుపుతామని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయమాల బాగ్చీ ధర్మాసనం తెలిపింది. ఎలక్టోరల్ రోల్స్ ప్రచురణపై మధ్యంతర స్టే విధించాలనే పిటిషనర్‌ వాదనలను ధర్మాసనం నిరాకరించింది.

అదే సమయంలో ఆధార్, ఓటర్ ఐడీలను కూడా గుర్తింపు కార్డులుగా అంగీకరించాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు సూచించింది. ఆధార్, ఓటర్ కార్డు, రేషన్ కార్డుల ఉంటే అంగీకరిస్తామని ఈసీ తెలిపిందని కోర్టు వెల్లడించింది. ‘రేషన్ కార్డుల విషయానికొస్తే వాటిని సులభంగా నకిలీ చేయొచ్చు. దాంతో పోలిస్తే ఆధార్, ఓటర్ కార్డులకు కొంత రక్షణ ఉందని భావించొచ్చు. వీటిని యాక్సెప్ట్ చేయండి’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.

Next Story