- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రొహింగ్యాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. వారికి అవకాశమివ్వండి
పిల్లలకు విద్యావకాశాల్లో ఎలాంటి వివక్షకు తావివ్వొద్దని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఢిల్లీలో రొహింగ్యా శరణార్థుల పిల్లలకు విద్య, వైద్య సదుపాయం కల్పించాలని, ప్రభుత్వానికి అనుగుణంగా ఆదేశాలివ్వాలని రొహింగ్యా మానవ హక్కుల ఎన్జీవో ఓ పిటిషన్ వేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: పిల్లలకు విద్యావకాశాల్లో ఎలాంటి వివక్షకు తావివ్వొద్దని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఢిల్లీలో రొహింగ్యా శరణార్థుల పిల్లలకు విద్య, వైద్య సదుపాయం కల్పించాలని, ప్రభుత్వానికి అనుగుణంగా ఆదేశాలివ్వాలని రొహింగ్యా మానవ హక్కుల ఎన్జీవో ఓ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ విచారిస్తూ ఢిల్లీలో ఉంటున్న రొహింగ్యా శరణార్థుల పిల్లలకూ విద్యావకాశాలను కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ రొహింగ్యా కుటుంబాలు ఎక్కడ నివసిస్తున్నాయి? ఎవరి ఇళ్లల్లో ఉంటున్నాయి? వంటి వివరాలు సమర్పించాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌ల ధర్మాసనం అడిగింది. ఎన్జీతో తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ అడ్వకేట్ కొలిన్ గొంజాల్వేజ్ ఆ వివరాలు పిటిషన్‌లో పొందుపరిచామని, మరిన్ని వివరాలు అందించడానికి కొంత సమయం ఇవ్వాలని కోర్టును కోరారు. పది రోజుల తర్వాత విచారిస్తామని కోర్టు వాయిదా వేసింది.
రొహింగ్యా శరణార్థుల పిల్లల వద్ద ఆధార్ కార్డులు లేనందున స్కూలు, హాస్పిటల్‌లలో సేవలు పొందలేకపోతున్నారు. ఢిల్లీ విద్యా సంస్థల్లో పది, 12వ తరగతులు, డిగ్రీ చదువులకూ, ప్రభుత్వ హాస్పిటళ్లలో వైద్య సేవలకు ఆధార్ లేదని సేవలు తిరస్కరించరాదని, సబ్సిడీ బియ్యం, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలూ వీరికి అందించాలని విజ్ఞప్తి చేసింది. ఈ శరణార్థుల దగ్గర యూఎన్‌హెచ్‌సీఆర్ కార్డులు ఉన్నాయని, ఆధార్ కార్డులు లేవని వివరించింది.






