- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భార్యాభర్తలు ఒకరిపై ఒకరు ఆధారపడాల్సిందే.. అలాకాదంటే పెళ్లిళ్లే చేసుకోవద్దు!
భార్యాభర్తలు ఒకరిపై ఒకరు ఆధారపడాల్సిందేనని, అలాకాదంటే పెళ్లిళ్లే చేసుకోకూడదని సుప్రీంకోర్టు తెలిపింది.

దిశ, నేషనల్ బ్యూరో: పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలిద్దరూ ఒకరిపై ఒకరు ఆధారపడి జీవించాలని, ఎవరిపైనా ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించాలనడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. పెళ్లి బంధం కొనసాగుతున్న సమయంలో స్వంతంత్రంగా జీవిస్తానని అనడం అసాధ్యమని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్‌తో కూడిన ధర్మాసనం తేల్చిచెప్పింది. ఒకరిపై ఒకరు ఆధారపడేందుకు ఇష్టపడని వ్యక్తులు అసలు పెళ్లే చేసుకోకూడదని హితబోధ చేసింది. ‘రెండు ఆత్మలు, ఇద్దరు వ్యక్తులు కలిసి రావడమే పెళ్లి అంటే. భాగస్వామి నుంచి స్వతంత్రం కోరుకుంటున్నాం అని ఏ భార్యా, భర్త అనకూడదు’ అని జస్టిస్ నాగరత్న చెప్పారు.
సింగపూర్‌లో ఉంటున్న భర్త, హైదరాబాద్‌లో ఉంటున్న భార్య ఇద్దరూ విడాకుల కోసం వేసిన కేసులో అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ జంటకు ఇద్దరు మైనర్ పిల్లలున్నారు. భర్త ప్రవర్తనతో విసిగిపోయానన్న సదరు భార్య.. తాను అతని వద్దకు వెళ్లలేనని, ఎవరిపైనా ఆధారపడకుండా స్వతంత్రంగా జీవిస్తానని కోర్టుకు తెలిపింది. ఈ వ్యాఖ్యలను తప్పుపట్టిన ధర్మాసనం.. ‘మీరు అలా అనకూడదు. ఒకసారి పెళ్లి చేసుకుంటే ఆర్థికంగా కాకపోయినా, మానసికంగా మీ భాగస్వామిపై ఆధారపడాల్సింది. అలా చేయడం ఇష్టంలేకపోతే పెళ్లి ఎందుకు చేసుకున్నారు?’ అని ప్రశ్నించింది. భార్యాభర్తలందరి మధ్య గొడవలు ఉంటాయని, ఈ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించింది. ఈ కేసుపై తదుపరి విచారణను సెప్టెంబరు 16కు వాయిదా వేసిన ధర్మాసనం.. ఇద్దరు పిల్లల సంక్షేమం చాలా ముఖ్యమని పేర్కొంది.






