- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈసీ నిర్ణయం ఓటర్-ఫ్రెండ్లీ.. బిహార్ ఎస్‌ఐఆర్‌పై సుప్రీంకోర్టు కామెంట్స్
బిహార్ ఎస్‌ఐఆర్‌లో గుర్తింపు ధ్రువీకరణ పత్రాల సంఖ్యను పెంచాలనే నిర్ణయం ఓటర్-ఫ్రెండ్లీ అని సుప్రీంకోర్టు తెలిపింది.

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌లో జరుగుతున్న ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ఓటర్-ఫ్రెండ్లీ అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. పౌరసత్వం నిరూపించుకునేందుకు అంగీకరించే ధ్రువపత్రాల సంఖ్యను 7 నుంచి 11కు ఎన్నికల సంఘం (ఈసీ) పెంచిన విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తుచేసింది. ఆధార్‌ను ఈ జాబితాలో చేర్చకపోవడంపై విపక్షాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
‘గుర్తింపు నిర్ధారించే డాక్యుమెంట్స్ సంఖ్యను వాళ్లు పెంచుతున్నారు. ఆధార్ ఈ జాబితాలో లేకపోవడంపై మీ వాదనలు మేం అర్థం చేసుకోగలం. కానీ ఈ పత్రాల సంఖ్యను 7 నుంచి 11కు పెంచడం ఓటర్ ఫ్రెండ్లీనే. ఇలా చేయడం వల్ల ఓటర్లకు మరిన్ని ఆప్షన్లు ఉంటాయి కదా’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వీ.. పౌరసత్వం నిరూపించుకునే అంశంలో ఈసీ వాదన పూర్తిగా మారిపోయిందని ఆరోపించారు.
‘పౌరసత్వం రుజువుల విషయంలో ఈసీ విధానం పూర్తిగా మారిపోయింది. ఎవరో ఒకరు ఫలానా వ్యక్తి భారత పౌరుడు కాదని అంటే.. ఈఆర్‌ఓ నోటీసులు పంపాలి. వాటికి సదరు వ్యక్తి బదులిస్తారు. ఈ తతంగం అంతా కేవలం రెండు నెలల్లో ఎలా పూర్తి చేస్తారు? డిసెంబరు నుంచి ఎస్ఐఆర్ ప్రారంభించి వచ్చే ఏడాది మొత్తం చేస్తామంటే ఎవరూ వ్యతిరేకించడం లేదు కదా’ అని సింఘ్వీ ప్రశ్నించారు.
ఫామ్-6లో ఓటర్ కార్డు పొందడానికి ఆధార్ సరిపోతుందని, కానీ ఈ విషయంలో ఈసీ తన విధానం మార్చేసుకుందన్నారు. ‘ఇప్పుడు సడెన్‌గా 2003 తర్వాత ఓటరు కార్డులు పొందిన వారంతా పౌరసత్వం నిరూపించుకోవాలంటే ఎలా? అలా చేయలేకపోతే ఓటర్ల జాబితాలో నుంచి తీసేస్తామంటున్నారు’ అని సింఘ్వీ నిలదీశారు.






