Supreme Court: మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వలేము.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

by B.Srinivas |

మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ప్రాతిపాదికన రిజర్వేషన్స్ ఉండకూడదని తెలిపింది.

Supreme Court: మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వలేము.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించలేమని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. ఈ ప్రాతిపాదికన కోటా ఉండకూడదని తెలిపింది. ఇది తీవ్రమైన అంశమని పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌లోని అనేక కులాలకు ఓబీసీ హోదా రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు 2010లో తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ పశ్చిమ బెంగాల్ (West Bengal) ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ బీఆర్ గవాయ్ (Br gaway), కేవీ విశ్వనాథన్‌ (Vishwanathan)లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఉండొద్దని వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించాలని పిటిషన్‌ను వాదిస్తున్న న్యాయవాదులను కోరింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 7కు వాయిదా వేసింది.

అయితే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబన్ వాదనలు వినిపిస్తూ పలు కులాలకు ఓబీసీ హోదా కల్పించడం మత ప్రాతిపదికన జరగలేదని, వెనుకబాటుతనం ప్రాతిపదికన జరిగిందని తెలిపారు. ఇది చాలా తీవ్రమైన విషయమని, వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగుల ఆకాంక్షలను ప్రభావితం చేస్తుందని చెప్పారు. హైకోర్టు తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని, తాత్కాలిక స్టే విధించాలని సిబల్‌ కోరారు. కాగా, పశ్చిమ బెంగాల్‌లో 77 కులాలకు ఓబీసీ హోదా కల్పించారు. ఇది చట్టవిరుద్ధమని పేర్కొంటూ హైకోర్టు దానిని తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Next Story