నీట్-పీజీ వాయిదా పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

by Vinod kumar |

నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)-పీజీ 2023ని వాయిదా వేయాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

నీట్-పీజీ వాయిదా పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
X

న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)-పీజీ 2023ని వాయిదా వేయాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వచ్చే నెల 5న జరగాల్సిన పరీక్ష షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామని కేంద్రం పేర్కొనడంతో విచారణ చేపట్టేందుకు జస్టిస్ ఎస్ఆర్ భట్, దీపాంకర్ దత్తాల బెంచ్ నిరాకరించింది. ఇప్పటికే పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైందని, కౌన్సిలింగ్ జూలై 15న నిర్వహించవచ్చని పరీక్షా బోర్డు(ఎన్ బీఈ) తరుఫున న్యాయవాది అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి ధర్మాసనానికి తెలిపారు. సాంకేతిక భాగస్వామితో సమీపంలో వేరే రోజున పరీక్ష నిర్వహించేందుకు తేదీలు అందుబాటులో లేవని భాటి తెలిపారు.

అంతకుముందు ఇంటర్న్‌షిప్ కోసం కటాఫ్ తేదీని పొడిగించినందున ఆగస్టు 11 తర్వాత కౌన్సెలింగ్ నిర్వహించాలని పిటిషనర్లు పరీక్షను వాయిదా వేయాలని కోరారు. మరోవైపు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సూఖ్ మాండవీయా కూడా లోక్‌సభలో పరీక్షా తేదీ మార్పుపై ఎలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. అయితే ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా ఇంటర్న్‌షిప్ కటాఫ్ తేదీని జూన్ 30 నుంచి ఆగస్టు 11కు పొడగించారు. కాగా, నీటీ పీజీ అభ్యర్థులు తప్పనిసరిగా ఏడాది కాలం పాటు ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

Next Story