అయోధ్య కేసుపై అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

by Malleboina Mahesh |

రామమందిరం చందాల చోరీ కేసుపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ.. ఆకాశమేమీ విరిగిపడదు, సెలవుల తర్వాతే విచారణ అంటూ బెంచ్ వ్యాఖ్యలు!

అయోధ్య కేసుపై అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
X

దిశ, వెబ్ డెస్క్: అయోధ్య రామమందిరంలో నిధుల దుర్వినియోగం (Embezzlement Case) పై నిష్పాక్షికమైన, సమయపాలనతో కూడిన దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ షీల్ నాగులతో కూడిన వెకేషన్ బెంచ్.. ఈ వ్యవహారాన్ని వేసవి సెలవుల (Summer Break) అనంతరం విచారణకు జాబితా చేస్తామని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా బెంచ్ ఓరల్‌గా స్పందిస్తూ.. "ఆకాశమేమీ విరిగిపడదు కదా.. ఇందులో అంత అత్యవసరమేముంది" అని వ్యాఖ్యానించడం గమనార్హం.

ఈ చందాల చోరీ కేసులో ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) లోతైన విచారణ జరుగుతోంది. మరోవైపు అయోధ్య బార్ అసోసియేషన్ కూడా నిందితుల తరఫున ఏ లాయరూ వాదించకూడదని, ధిక్కరిస్తే రూ. 5 లక్షల ఫైన్ విధిస్తామని కఠిన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన పిటిషనర్లకు ప్రస్తుతానికి అత్యున్నత న్యాయస్థానంలో నిరాశే ఎదురైంది. కోర్టు సెలవుల తర్వాతే దీనిపై పూర్తి స్థాయి విచారణ జరగనుంది.

Next Story