- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపునకు సుప్రీంకోర్టు నిరాకరణ
గత పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ (సవరణ) చట్టం 2025 ను ఆమోదించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: గత పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ (సవరణ) చట్టం 2025 ను ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ వక్ఫ్ సరవరణ చట్టం (Waqf Amendment Act) ప్రకారం వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం ఆరు నెలల గడువు నిర్ణయించారు. అయితే ఈ గడువును పొడిగించాలంటూ సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై రోజు విచారించిన కోర్టు.. వారి వాదనను తోసిపుచ్చింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ నేతృత్వంలోని ధర్మాసనం, దరఖాస్తుదారులు తమ రిలీఫ్ కోసం 2025 చట్టం ప్రకారం నేరుగా వక్ఫ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలని సూచించింది.
ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ డిసెంబర్ 6 అని తమకు సమాచారం అందిందని ధర్మాసనం పేర్కొంది. దరఖాస్తుదారులు ట్రిబ్యునల్‌కు వెళ్లడం ద్వారా రిలీఫ్ పొందవచ్చని, ఆరు నెలల గడువును పొడిగించుకోవచ్చని స్పష్టం చేసింది. దరఖాస్తుదారుల తరఫు న్యాయవాదులు, ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం ఉద్దేశించిన 'UMEED' పోర్టల్‌లో నమోదు ప్రక్రియతో పాటు, డిజిటలైజేషన్‌లో కూడా సాంకేతిక సమస్యలు (Glitches) ఎదురవుతున్నాయని కోర్టుకు తెలిపారు.
ఈ సాంకేతిక సమస్యలపై ట్రిబ్యునల్ విచారణ జరిపే సమయానికి, డిసెంబర్ 6 గడువు ముగుస్తుందని వారు వాదించారు. అయినప్పటికీ, సుప్రీంకోర్టు ఈ వాదనను అంగీకరించకుండా, పోర్టల్‌లో నమోదు చేయడంలో నిజమైన ఇబ్బందులు ఎదుర్కొనే ఏ దరఖాస్తుదారుడైనా ట్రిబ్యునల్ వద్ద గడువు పొడిగింపును కోరవచ్చని పునరుద్ఘాటించింది. ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల రిజిస్ట్రేషన్ నిలిచిపోయినా, ట్రిబ్యునల్ గడువును అనుమతిస్తే, వారికి ఆరు నెలల సమయం లెక్కించబడుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.






