- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Supreme court: పెళ్లిని నిరాకరించడం ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు కాదు.. సుప్రీంకోర్టు
ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 306 ప్రకారం పెళ్లిని నిరాకరించడం ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు కాదని సుప్రీంకోర్టు తెలిపింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఇండియన్ పీనల్ కోడ్ (IPC)లోని సెక్షన్ 306 ప్రకారం పెళ్లిని నిరాకరించడం ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు కాదని సుప్రీంకోర్టు (Supreme court) తెలిపింది. ఈ మేరకు వివాహాన్ని తిరస్కరించడంతో పాటు ఆత్మహత్యకు ప్రేరేపించిందనే ఆరోపణలతో ఓ మహిళపై దాఖలైన చార్జిషీట్‌ను కొట్టి వేసింది. ఒక యువకుడు, యువతి కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే యువకుడి తల్లికి ఈ విషయం తెలియడంతో వారిద్దరి పెళ్లికి నిరాకరించడంతో పాటు అమ్మాయిని అసభ్య పదజాలంతో దూషించగా మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుందని ఆరోపణలున్నాయి. దీంతో ఆమె కుటుంబ సభ్యులు యువకుడి తల్లిపై ఫిర్యాదు చేశారు. సూసైడ్‌కు ప్రేరేపించినట్టు పేర్కొన్నారు. దీనిపై ఆ మహిళ సుప్రీంకోర్టులో అప్పీల్ చేయగా జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
చార్జిషీటు, సాక్షుల వాంగ్మూలాలు సహా రికార్డుల్లో ఉన్న అన్ని ఆధారాలు నిజమని భావించినప్పటికీ, అప్పీల్ దారుకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా లేదని ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్ల ఆరోపణలు పరోక్షంగా ఉన్నాయని, ఐపీసీ సెక్షన్ 306 ప్రకారం అవి నేరంగా పరిగణించబడవని తెలిపింది. యువతి ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేకుండా అప్పీలుదారు చేసినట్టు సాక్ష్యం లేదని వెల్లడించింది. మరణించిన వారి కుటుంబమే ఈ సంబంధం పట్ల అసంతృప్తిగా ఉందని, ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆరోపించే స్థాయికి చేరుకోలేదని బెంచ్ పేర్కొంది.






