- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Supreme Court: పహల్గాం ఉగ్రదాడి ఘటనపై సుప్రీం కోర్టులో పిల్.. అసలు విషయం ఇదే!
జమ్మూకశ్మీర్ (Jammu Kashmir)లోని అనంత్‌నాగ్ (Anantnag) జిల్లా పహల్గాం (Pahalgam)లో ఉగ్రమూకలు సృష్టించిన మారణ హోమం దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది.

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్ (Jammu Kashmir)లోని అనంత్‌నాగ్ (Anantnag) జిల్లా పహల్గాం (Pahalgam)లో ఉగ్రమూకలు సృష్టించిన మారణ హోమం దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. విహార యాత్రకు వెళ్లిన టూరిస్టులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. పుల్వామా దాడి తరువాత కశ్మీర్ లోయలో జరిగిన మరో అతిపెద్ద దాడి ఇదే కావడం దురదృష్టకరం. మంగళవారం జరిగిన దుర్ఘటనలో ఇప్పటి వరకు దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మొత్తం 28 మంది టూరిస్టులు (Tourists) ప్రాణాలు కోల్పోయారు. అందులో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ఇప్పటికే నిషేధిత లష్కర్-ఎ-తోయిబా (Lashkar-e-Taiba) అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (‘The Resistance Front’) ప్రకటించుకుంది.
ఈ క్రమంలోనే పహల్గాం ఉగ్రదాడి ఘటనపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court)లో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది విశాల్ తివారి (Vishal Tiwari) ఆ పిల్‌ను దాఖలు చేశారు. అందులో దేశంలోని అన్ని పర్యటక ప్రాంతాల్లో భద్రతను కట్టదిట్టం చేయాలని పేర్కొన్నారు. ప్రధాన నగరాలతో పాటు పర్యాటలకు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సాయుధ బలగాల (Armed Forces)ను మోహరించాలని పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ (Central Home Ministry) అన్ని రాష్ట్రాల పోలీసులకు వెంటనే ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషనలో పేర్కొన్నారు.Supreme Court: పహల్గాం ఉగ్రదాడి ఘటనపై సుప్రీం కోర్టులో పిల్.. అసలు విషయం ఇదే!






