ఐప్యాక్ ఆఫీసులో సోదాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-15 11:22:49  IST  )

ఐప్యాక్ ఆఫీసులో సోదాలపై సుప్రీంకోర్టులో ఈడీ అధికారులకు ఊరట లభించింది. కొద్దిరోజుల క్రితం ఐప్యాక్ ఆఫీసులో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించగా.. ఆ సోదాలను వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అడ్డుకున్నారు.

ఐప్యాక్ ఆఫీసులో సోదాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: ఐప్యాక్ ఆఫీసులో సోదాలపై సుప్రీంకోర్టులో ఈడీ అధికారులకు ఊరట లభించింది. కొద్దిరోజుల క్రితం ఐప్యాక్ ఆఫీసులో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించగా.. ఆ సోదాలను వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అడ్డుకున్నారు. ఈడీ అధికారులు.. తమ నుంచి కీలక ఫైల్స్ ను తీసుకెళ్లినట్లుగా ఆరోపిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో బెంగాల్ సీఎం మమత, పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.ఈడీ విధుల్లో జోక్యం చేసుకోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై రెండువారాల్లో సమాధానమివ్వాలని ఆదేశాల్లో పేర్కొంది. అలాగే ఐప్యాక్ ఆఫీసులో సీసీఫుటేజీని భద్రపరచాలని ఆదేశించింది. దాడుల సమయంలో తీసిన వీడియోలు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ తో పాటు ఇతర స్టోరేజ్ పరికరాలను భద్రపరచాలని ప్రతివాదులను కోర్టు ఆదేశించింది.

విచారణ సందర్భంగా సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింగ్‌వీ, దర్యాప్తు బలవంతపు చర్యలు లేకుండా కొనసాగించాలని కోర్టును కోరారు. అలాగే స్టే కొనసాగితే.. అవసరమైతే మరిన్ని దరఖాస్తులు దాఖలు చేసేందుకు అదనపు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.ఈడీ అధికారులపై నమోదైన ఎఫ్ఐఆర్ పై రెండు వారాల వరకూ స్టే విధించింది. బెంగాల్ డీజీపీని సస్పెండ్ చేయాలన్న ఈడీ పిటిషన్ పై విచారణ చేసిన సుప్రీంకోర్టు.. కేంద్ర హోంశాఖకు నోటీసులు పంపింది.

Next Story