సినిమా టికెట్ ధరల పెంపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-05 15:46:39  IST  )

సినిమా టికెట్ల ధరలను పెంచడంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సామాన్య ప్రజలు ఒక సినిమా చూడాలంటే రూ.2 వేలు ఖర్చు చేయాల్సి వస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

సినిమా టికెట్ ధరల పెంపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: సినిమా టికెట్ల ధరలను పెంచడంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సామాన్య ప్రజలు ఒక సినిమా చూడాలంటే రూ.2 వేలు ఖర్చు చేయాల్సి వస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఒక వాటర్ బాటిల్ కు రూ.100 వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా టికెట్ల ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వాలు విధివిధానాలు రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. టికెట్ ధరలను రూ.200కు పరిమితం చేయాలని ప్రతిపాదించింది. అలాగే ప్రతి టికెట్ కు రికార్డులను మెయింటైన్ చేయాలని మల్టీప్లెక్స్ ఆపరేటర్లను ఆదేశించింది. ఇటీవల విడుదలైన సినిమాలకు సంబంధించిన టికెట్ల రేట్లను రూ.1000, రూ.800 వరకూ పెంచిన విషయం తెలిసిందే. అగ్రహీరోల సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాల విడుదల సందర్భంగా 10 రోజుల వరకూ టికెట్ రేట్లను పెంచుకోవచ్చని చెప్తూ.. రాష్ట్ర ప్రభుత్వాలు జీఓలు జారీ చేస్తున్నాయి. సుప్రీంకోర్టు తాజాగా జారీ చేసిన ఆదేశాలతో భారీ బడ్జెట్ సినిమాలకు షాక్ తగిలినట్లయింది.

Next Story