- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిటైర్డ్ న్యాయమూర్తులకు సమాన పెన్షన్.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు
రిటైర్మెంట్ తర్వాత ఇచ్చే బెనిఫిట్స్ లో ఎలాంటి తేడా చూపవద్దని జస్టిస్ బీఆర్ గవాయ్ అభిప్రాయపడ్డారు.

దిశ, వెబ్‌డెస్క్: హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తుల్లో కొందరికి పెన్షన్ తక్కువగా వస్తుండటంపై దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఉద్యోగంలో చేరిన తేదీ, ఇతర విషయాలను బేరీజు వేయకుండా అందరికీ ఒకే రకమైన పెన్షన్ ఇవ్వాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ న్యాయమూర్తులకు, జిల్లాల న్యాయమూర్తులకు రిటైర్మెంట్ తర్వాత వచ్చే బెనిఫిట్స్ ఈక్వల్ గా ఉండాలని స్పష్టం చేస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
రిటైర్మెంట్ తర్వాత ఇచ్చే బెనిఫిట్స్ లో ఎలాంటి తేడా చూపవద్దని జస్టిస్ బీఆర్ గవాయ్ అభిప్రాయపడ్డారు. వితంతువులు, ఇతరులకు గ్రాట్యూటీ, ఫ్యామిలీ పెన్షన్ ప్రయోజనాలను కూడా సమానంగా అందించాలని తెలిపారు. టెర్మినల్ బెనిఫిట్స్ కోసం రిటైర్మెంట్ తర్వాత జడ్జిల మధ్య ఎలాంటి వివక్ష చూపించినా అది ఆర్టికల్ 14 ఉల్లంఘన కిందికే వస్తుందన్నారు. ఇకపై అన్ని హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తులకు ఏడాదికి రూ.15 లక్షలు, రిటైర్డ్ హైకోర్టు జడ్జిలకు రూ.13.5 లక్షలు చెల్లించాలని కేంద్రానికి జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు.






