- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జ్యుడీషియల్ పర్యవేక్షణలో ఎస్ఐఆర్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
బెంగాల్‌లో జ్యుడీషియల్ పర్యవేక్షణలో ఎస్ఐఆర్ నిర్వహించాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది.

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లో జ్యుడీషియరీ పరిశీలనలో ఎస్ఐఆర్ ప్రక్రియ జరిపించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికల సంఘం (ఈసీ), బెంగాల్ ప్రభుత్వం మధ్య నమ్మకం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. మాజీ అదనపు జిల్లా జడ్జీలను ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించే జ్యుడీషియల్ ఆఫీసర్లుగా కలకత్తా హైకోర్టు సీజే నియమిస్తారని తేల్చిచెప్పింది. ‘బెంగాల్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తిచేయడమే ప్రధాన సమస్య. ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నా.. రెండు రాజ్యాంగ విభాగాలైన ప్రభుత్వం, ఈసీ మధ్య నమ్మకం కనిపించడం లేదు. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ ఉన్నారు’ అని సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయమాల బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం పంచోలీతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ బ్లేమ్ గేమ్ వల్ల తమ వద్ద మరో ఆప్షన్ లేకుండా పోయిందని, అందుకే జ్యుడీషియల్ పరిశీలకులను నియమించాలని నిర్ణయించామని తెలిపింది. మైక్రో అబ్జర్వర్లను ఈసీ నియమించడాన్ని టీఎంసీ సర్కారు తప్పు పడుతోంది, అదే సమయంలో ఎలక్టోరల్ రిజిస్టర్ ఆఫీసర్లుగా (ఈఆర్‌వో) వ్యవహరించేందుకు సరిపడా గ్రూప్ బీ అధికారులను మమత సర్కారు కేటాయించలేదని ఈసీ అంటోంది. ఈ క్రమంలోనే హైకోర్టు నియమించే జ్యుడీషియల్ అధికారులు ఈఆర్‌వోలుగా సేవలందిస్తారని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.






