- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
థగ్ లైఫ్ బ్యాన్..కర్నాటక ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సుప్రీం
తమిళం నుండే కన్నడ పుట్టింది అంటూ కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలతో కర్నాటక ఫిల్మ్ చాంబర్ ఆ సినిమా విడుదలను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో చిత్రయూనిట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

దిశ, వెబ్ డెస్క్: తమిళం నుండే కన్నడ పుట్టింది అంటూ కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలతో కర్నాటక ఫిల్మ్ చాంబర్ ఆ సినిమా విడుదలను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో చిత్రయూనిట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాగా సుప్రీంకోర్టు కర్నాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. థగ్ లైఫ్ సినిమాపై బ్యాన్ ఎప్పుడు ఎత్తివేస్తారో ఖచ్చితంగా చెప్పాలని ప్రశ్నించింది. విచారణను జూన్ 17కు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే థగ్ లైఫ్ సినిమాను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సర్టిఫై చేసినప్పటికీ ఆందోళనలు, పోలీసుల జోక్యంతో ఎలాంటి ప్రభుత్వ అధికారిక బ్యాన్ లేకుండా బ్యాన్ చేశారని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఆందోళనలను కట్టడి చేయడంలో విఫలమై సినిమాపై మౌకికంగా బ్యాక్ చేయాలని ఆదేశించిందని పేర్కొన్నారు. ఇది ఆర్టికల్ 19 (1) (ఏ)ను హరించడమే అని పేర్కొన్నారు. థియేటర్ లో బ్యాన్ చేసినా ఆన్లైన్ మాద్యమాల్లో రాకుండా ఆపలేరన్నారు.






