స్కూళ్లలో త్రిభాషా సూత్రం అమలుపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. కేంద్రం, సీబీఎస్‌ఈ, ఎన్‌సీఈఆర్‌టీలకు నోటీసులు!

by Malleboina Mahesh |

9వ తరగతి విద్యార్థులకు త్రిభాషా సూత్రం అమలుపై కేంద్రం, CBSE లకు సుప్రీంకోర్టు నోటీసులు.. భాష నేర్చుకోవడం వృథా పోదన్న ధర్మాసనం!

స్కూళ్లలో త్రిభాషా సూత్రం అమలుపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. కేంద్రం, సీబీఎస్‌ఈ, ఎన్‌సీఈఆర్‌టీలకు నోటీసులు!
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా పాఠశాలల్లో 9వ తరగతి విద్యార్థులకు రాబోయే విద్యా సంవత్సరం (2026-27) నుంచి త్రిభాషా సూత్రాన్ని (Three-Language Policy) అమలు చేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన కొత్త పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక విచారణ చేపట్టింది. ఈ విధానంపై తమ స్పందనను తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE), నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) లకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

భాష నేర్చుకోవడం ఎప్పటికీ వృథా పోదు..సుప్రీంకోర్టు వ్యాఖ్య

భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరుపుతూ.. ప్రతివాదులైన కేంద్రం, సీబీఎస్‌ఈ, ఎన్‌సీఈఆర్‌టీలు తమ సమాధానాలను దాఖలు చేయడానికి 10 రోజుల సమయాన్ని మంజూరు చేసింది. ఈ కేసు తదుపరి విచారణను న్యాయస్థానం జూలై 22, 2026 కి వాయిదా వేసింది. అయితే, ఈ విధానాన్ని సవాలు చేయడంపై విచారణ జరుపుతూనే.. ధర్మాసనం ఒక కీలకమైన మౌఖిక వ్యాఖ్యలు చేసింది. విద్యార్థులు అదనంగా ఏదైనా ఒక "భాషను నేర్చుకోవడం అనేది ఎప్పటికీ వృథా పోదు అని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం. జాతీయ విద్యా విధానం (NEP) సిఫార్సుల మేరకు ఈ త్రిభాషా సూత్రాన్ని 9వ తరగతి నుండి అమలు చేయడానికి విద్యా సంస్థలు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ఎలాంటి తుది తీర్పు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Next Story