- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీజేఐపై బూటు విసిరిన ఘటన.. కోర్టు ధిక్కార చర్యలకు అనుమతించని సుప్రీం ధర్మాసనం
సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ పై ఇటీవల రాకేష్ కిశోర్ అనే న్యాయవాది బూటు విసిరిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

దిశ, వెబ్‌డెస్క్: సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ పై ఇటీవల రాకేష్ కిశోర్ అనే న్యాయవాది బూటు విసిరిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. పలు రాష్ట్రాల సీఎంలు, ప్రధాని మోదీ, రాజకీయ నాయకులు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. తాజాగా ఈ దీనిపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేయగా.. దానిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. దాడికి పాల్పడిన న్యాయవాది రాకేష్ కిశోర్ పై కోర్టు ధిక్కార చర్యలకు అనుమతించబోమని స్పష్టం చేసింది.
రాకేష్ కిశోర్ కు నోటీసు జారీ చేయాలని జస్టిస్ సూర్యకాంత్, జోయ్ మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనాన్ని కోరినా.. అందుకు కోర్టు నిరాకరించింది. కోర్టులో నినాదాలు చేయడం, బూట్లు విసిరేయడం వంటి చర్యలు కోర్టు ధిక్కారానికి సంబంధించిన కేసులే అయినా వీటిపై చట్టప్రకారం ముందుకు వెళ్లాలా వద్దా అన్నది న్యాయమూర్తి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ఇప్పుడు రాకేష్ కిశోర్ కు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేస్తా.. అతనికి అనవసర ప్రాధాన్యత కల్పించినట్లు అవుతుందని అభిప్రాయపడింది. భవిష్యత్తులో న్యాయమూర్తులపై ఇలాంటి ఘటనలు, దాడులు జరగకుండా ఉండేలా తీసుకోవాల్సిన చర్యలను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది.






