- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండిగో సంక్షోభంపై జోక్యం చేసుకోం.. సుప్రీం ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు
ఇండిగో (IndiGo) సంక్షోభంతో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై ఈనెల 6న పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ఇండిగో (IndiGo) సంక్షోభంతో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై ఈనెల 6న పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులకు జరిగిన నష్టాలపై జోక్యం చేసుకోవాలని, చీఫ్ జస్టిస్ స్వయంగా విచారణ చేపట్టాలని ఆ పిటిషన్‌లో కోరారు. పౌర విమానయాన శాఖ, DGCA స్టేటస్ నివేదికలు సమర్పించేలా ఆదేశించాలని, తక్షణ విచారణ కోసం ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు ఇవాళ ఆ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ (CJI Suryakant) ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న సీజేఐ, ఇండిగో సంక్షోభంపై అత్యవసర విచారణకు నిరాకరించారు. సమస్యపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. ఇండిగో విమానాల రద్దు తీవ్రమైన సమస్యగానే తాము భావిస్తున్నామని, లక్షలాది మంది ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడిన మాట వాస్తవమేనని సీజేఐ సూర్యకాంత్ అన్నారు.






