- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్తి పంపకాలపై హిందూ మహిళలకు సుప్రీంకోర్టు కీలక అలర్ట్
గత కొద్ది సంవత్సరాలుగా దేశంలోని హిందూ మహిళల ఆస్తి వారసత్వంపై తరచూ వివాదాలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. దీంతో మహిళల ఆస్తి పంపకాలపై తరుచు ఇరు కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది సంవత్సరాలుగా దేశంలోని హిందూ మహిళల ఆస్తి వారసత్వంపై తరచూ వివాదాలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. దీంతో మహిళల ఆస్తి పంపకాలపై తరుచు ఇరు కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలు తమ మరణానంతరం ఆస్తి ఎవరికి వెళ్లాలి అనేది స్పష్టంగా ఉండాలంటే వీలునామా (Will) తప్పనిసరిగా రాసుకోవాలని కోర్టు సూచించింది. పిల్లలు లేని పరిస్థితిలో, ప్రస్తుత హిందూ వారసత్వ చట్టం ప్రకారం, మహిళ ఆస్తి మొదటగా భర్త కుటుంబానికి వెళ్లే అవకాశం ఉంటుందని కోర్టు గుర్తు చేసింది. దీంతో చాలా సందర్భాల్లో మహిళ తల్లిదండ్రుల కుటుంబం, అత్తింటి వారి మధ్య వివాదాలు చెలరేగుతున్నాయని మండిపడింది.
మహిళ గోత్రం వివాహానంతరం మారుతుందన్న సంప్రదాయ అంశాన్ని కూడా కోర్టు ప్రస్తావిస్తూ, వివాహం తర్వాత మహిళపై ప్రధాన బాధ్యత భర్త కుటుంబానిదే అవుతుందని పేర్కొంది. ఈ కారణంగా వారసత్వ హక్కుల్లో తలెత్తే సమస్యలు పరిష్కరించేందుకు ప్రీ–లిటిగేషన్ మిడియేషన్ (మధ్యవర్తిత్వం) తప్పనిసరి చేయాలని కోర్టు ఆదేశించింది. మధ్యవర్తిత్వం లో వచ్చే ఒప్పందాలను కోర్టు తీర్పు (డిక్రీ)గా పరిగణించాలని తెలిపింది. కొంతమంది న్యాయవాదులు ప్రస్తుత వారసత్వ చట్టంలోని సెక్షన్ 15(1)(బి) వివక్షాత్మకమని అభిప్రాయపడుతున్నప్పటికీ, ఈ చట్టాన్ని సవరిస్తే అది పార్లమెంట్ చేయాల్సిన పని మాత్రమేనని కోర్టు స్పష్టం చేసింది.






