సెలబ్రిటీలపై కేఏ పాల్ పిటిషన్.. కేంద్రం, ప్రతివాదులకు సుప్రీం నోటీసులు

by Naga Rani Yarlagadda |

బెట్టింగ్ యాప్స్ నిషేధంపై, బెట్టింగ్ యాప్స్ (Betting Apps)ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై చర్యలు తీసుకోవాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) దాఖలు చేసిన పిల్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారం విచారణ చేపట్టింది.

సెలబ్రిటీలపై కేఏ పాల్ పిటిషన్.. కేంద్రం, ప్రతివాదులకు సుప్రీం నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: బెట్టింగ్ యాప్స్ నిషేధంపై, బెట్టింగ్ యాప్స్ (Betting Apps)ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై చర్యలు తీసుకోవాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) దాఖలు చేసిన పిల్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారం విచారణ చేపట్టింది. ఒక్క తెలంగాణలోనే బెట్టింగ్ యాప్స్ వల్ల 1023 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని, దేశవ్యాప్తంగా చూస్తే ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉంటుందని వాదనలు, ప్రతివాదనలు జరిగాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంతో పాటు.. ప్రతివాదులకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కే. సింగ్ లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించగా.. బెట్టింగ్ యాప్స్ ద్వారా ప్రోత్సహించే జూదంతో యువత జీవితాలు నాశమవుతున్నాయని కేఏ పాల్ వాదించారు. బెట్టింగ్ యాప్స్ యువతను తప్పుదారి పట్టిస్తున్నాయని, వారిని ఆర్థికంగా, మానసికంగా నాశనం చేస్తున్నాయని, అలాంటి యాప్స్ ను ప్రచారం చేసే సెలబ్రిటీలపై చర్యలు తీసుకోవాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. కేఏ పాల్ వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. కేంద్ర ప్రభుత్వం, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపింది. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం నోటీసులు జారీ చేస్తామని స్పష్టం చేసింది.

Next Story