Supreme Court of India : మణిపూర్ ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్

by GSrikanth |
Supreme Court of India : మణిపూర్ ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ ఘటన తమను అందోళనకు గురి చేసిందని పేర్కొంది. ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇలాంటి దాడులు ఆమోదయోగ్యం కాదని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోని పక్షంలో న్యాయస్థానమే చర్యలు చేపడుతుందన్నారు. జాతుల మధ్య కలహాల ప్రాంతంలో మహిళను సాధనంగా ఉపయోగించడం ఇది రాజ్యాంగ దుర్వినియోగమే అని వ్యాఖ్యానించారు.

Read More: PM Modi: మణిపూర్ అల్లర్లపై స్పందించిన ప్రధాని మోడీ.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్

మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన పై మణిపూర్ సీఎం సీరియస్.. వారికి మరణ శిక్ష..?

Next Story

Most Viewed