- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Supreme Court: పహల్గాం ఉగ్రదాడిపై సుప్రీం కోర్టులో విచారణ.. పిటిషనర్లపై ధర్మాసనం సీరియస్
పహల్గాం టెర్రర్ అటాక్ (Pahelgam Terror Attack) వ్యవహారంపై సుప్రీం కోర్టు (Supreme Court) రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్ (Judicial Commission) ఏర్పాటు చేయాలని ఫతేష్ కుమార్ షాహు (Fateh Kumar Shahu), మొహమ్మద్ జునైద్ (Mohammad Junaid), విక్కీ కుమార్ (Vicky Kumar)లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: పహల్గాం టెర్రర్ అటాక్ (Pahelgam Terror Attack) వ్యవహారంపై సుప్రీం కోర్టు (Supreme Court) రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్ (Judicial Commission) ఏర్పాటు చేయాలని ఫతేష్ కుమార్ షాహు (Fateh Kumar Shahu), మొహమ్మద్ జునైద్ (Mohammad Junaid), విక్కీ కుమార్ (Vicky Kumar)లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా కేంద్ర భూభాగంలోని పర్యాటక ప్రాంతాల్లో పౌరుల భద్రతను నిర్ధారించడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కేంద్రం, జమ్మూకశ్మీర్ (Jammu Kashmir), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) మరియు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)లను ఆదేశించాలని అందులో కోరారు.
ఈ మేరకు ఇవాళ వారి పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్ (Justice Suryakant), జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ (Justice N. Kotishwar Singh)లతో కూడిన ద్విసభ్య ఓ రేంజ్‌లో సీరియస్ అయింది. పిల్ దాఖలు చేసే ముందు బాధ్యతగా వ్యవహరించాలని హెచ్చరించారు. ఈ క్రమంలో పిటిషనర్లను దేశంపై బాధ్యత లేదా అని న్యాయమూర్తుల ప్రశ్నించారు. ఇలా పిటిషన్లు వేసి దేశ భద్రతా బలగాల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తారా అని ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి క్లిష్ట సమమంలో ప్రతి పౌరుడు చేతులు కలపాల్సిన సమయం ఇది అని అన్నారు. సాయుధ బలగాలను నిరాశపరిచేలా ఇలా ఎవరూ ఎలాంటి పిటిషన్లు వేయకూడదని కోర్టు వార్నింగ్ ఇచ్చింది. పహల్గాం టెర్రర్ ఎటాక్ (Pahelgam Terror Attack)పై పిటిషన్ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేయగా.. పిటిషనర్లు పిల్‌ను ఉపసంహరించుకున్నారు.






