- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆమె ఏమైనా హత్య చేసిందా? పూజా ఖేద్కర్‌కు ముందస్తు బెయిల్ మంజూరు
నకిలీ సర్టిఫికెట్లతో ఐఏఎస్ ప్రొబెషనరీ ఆఫీసర్‌గా చెలామణి అయిన పూజా ఖేద్కర్ (Puja Khedkar) కు సుప్రీంకోర్టు (Supreme Court) ముందస్తు బెయిల్ (Anticipatory Bail) మంజూరు చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: నకిలీ సర్టిఫికెట్లతో ఐఏఎస్ ప్రొబెషనరీ ఆఫీసర్‌గా చెలామణి అయిన పూజా ఖేద్కర్ (Puja Khedkar) కు సుప్రీంకోర్టు (Supreme Court) ముందస్తు బెయిల్ (Anticipatory Bail) మంజూరు చేసింది. పూజా ఖేద్కర్ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు తీవ్రతను బట్టి చూస్తే ఆమెకు ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) బెయిల్ మంజూరు చేసి ఉండాల్సిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
ఓబీసీ సర్టిఫికెట్ (OBC Certificate)తో వికలాంగుల కోటా ద్వారా సివిల్ సర్వీస్ పరీక్షలో పాసైనట్లు చూపించి ఉద్యోగం సంపాదించిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ చేసిన సుప్రీంకోర్టు.. జస్టిస్ బీవీ నాగరత్న, సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. పూజా ఖేద్కర్ విచారణకు సహకరించాలని కోరారు. అలాగే ఆమె డ్రగ్ లార్డ్, ఉగ్రవాది కాదని, 302 సెక్షన్ కింద నేరమేమైనా చేసిందా? ఎన్డీపీఎస్ నేరానికి పాల్పడిందా? అని ధర్మాసనం ప్రశ్నించింది. అన్నీ కోల్పోయిందని, ఇక ఎక్కడా ఆమెకు ఉద్యోగం దొరకదని పేర్కొంది.
కాగా.. పూజా ఖేద్కర్ కు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని ఢిల్లీ పోలీస్ (Delhi Police) తరపు లాయర్ వ్యతిరేకించారు. ఆమెపై తీవ్రమైన ఆరోపణలున్నాయని, విచారణకు సహకరించడం లేదని వాదించారు. 2022 యూపీఎస్సీ అప్లికేషన్లో తప్పుడు సమాచారం పొందుపరిచినట్లు ఆరోపణలున్నాయి. ఈ మేరకే ఢిల్లీ పోలీసులు ఆమెపై చీటింగ్ కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.






