- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు.. ప్రకటించిన కేంద్రం
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త జడ్జీలను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త జడ్జీలను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ రాష్ట్రాలకు చెందిన హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతో పాటు.. ఒక సీనియర్ న్యాయవాదిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వివరాలను కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ద్వారా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల గరిష్ట సంఖ్యను (Sanctioned Strength) 34 నుండి 38కి పెంచింది. ఈ తాజా నియామకాలతో సుప్రీంకోర్టులో ప్రస్తుతం మొత్తం 37 మంది న్యాయమూర్తులు కొలువుదీరినట్లయింది. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం గత వారం చేసిన సిఫార్సుల మేరకు కేంద్రం ఈ నియామకాలు చేపట్టింది.
పంజాబ్ & హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శీల్ నాగు, బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రశేఖర్, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ సచ్ దేవా, జమ్మూ కాశ్మీర్ & లడఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ పల్లి, సీనియర్ అడ్వకేట్ వి. మోహన సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. వి. మోహన 2015లో సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్‌గా గుర్తింపు పొందారు. సాయుధ దళాలలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్, కర్ణాటక హిజాబ్ నిషేధం వంటి పలు సంచలన కేసుల్లో ఆమె వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు చరిత్రలో ఈమె 12వ మహిళా న్యాయమూర్తి కావడం విశేషం. జస్టిస్ బి.వి. నాగరత్నతో కలిపి ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న ఇద్దరు మహిళా జడ్జీలలో ఈమె ఒకరు కానున్నారు. నేరుగా బార్ నుండి ఎంపిక కావడం వల్ల ఈమెకు దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ పదవీకాలం లభించనుంది.






