- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Supreme court: డిజిటల్ యాక్సెస్ ప్రాథమిక హక్కు.. సుప్రీంకోర్టు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం డిజిటల్ యాక్సెస్ అనేది ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (Artical 21) ప్రకారం డిజిటల్ యాక్సెస్(Digital access) అనేది ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు (Supreme court) స్పష్టం చేసింది. వికలాంగులు, యాసిడ్ దాడి బాధితులకు ఈకేవైసీ సదుపాయం కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై దాఖలైన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై జస్టిస్ జేబీ పార్థీవాలా, ఆర్ ఆర్ మహాదేవన్ లతో కూడిన బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది. డిజిటల్ విధానాలు ముఖ్యంగా ఈకేవైసీ వంటి తప్పనిసరి ప్రక్రియలు అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని ప్రభుత్వానికి సూచించింది. డిజిటల్ యాక్సెస్ హక్కు అనేది ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో అంతర్భాగమని తెలిపింది. ఏ పౌరుడిని కూడా దీని నుంచి మినహాయించలేమని పేర్కొంది. డిజిటల్ అంతరాన్ని తగ్గించడం రాజ్యాంగ బాధ్యతగా మారిందని తెలిపింది.
బ్యాంకింగ్, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి కీలకమైన సేవలు ఆన్‌లైన్‌లోకి వేగంగా అప్ డేట్ అవుతున్నందున, ప్రస్తుత సాంకేతికత దృష్యా జీవించే హక్కును అర్థం చేసుకోవడం చాలా అవసరమని కోర్టు అభిప్రాయపడింది. ముఖ్యంగా బలహీన, అణగారిన వర్గాలకు అన్ని డిజిటల్ సేవలు అందరికీ అందుబాటులో ఉండేలా చూసుకోవడం రాజ్యాంగ బాధ్యత అని పేర్కొంది. ప్రతి పౌరుడికీ అన్ని ప్రభుత్వ వెబ్‌సైట్‌లు, విద్యా పోర్టల్‌లు, ఆర్థిక సాంకేతిక వేదికలను సార్వత్రికంగా అందుబాటులో ఉంచాలని తెలిపింది. డిజిటల్ ఈకేవైసీ, సాంకేతికతను మరింత కలుపుకుని పోయేలా మార్పులు చేయాలని కోర్టు 20 ఆదేశాలు జారీ చేసింది.






