- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముఖ్యమంత్రికి షాకిచ్చిన సుప్రీంకోర్టు.. కుటుంబ సభ్యుల కాంట్రాక్టులపై CBI విచారణకు ఆదేశం
అరుణాచల్ సీఎం పెమా ఖండూ బంధువుల సంస్థలకు కేటాయించిన రూ.వేల కోట్ల కాంట్రాక్టులపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది.

దిశ, వెబ్‌డెస్క్: అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ (Pema Khandu)కు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)లో చుక్కెదురైంది. అధికార దుర్వినియోగానికి పాల్పడి, కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీలకు భారీ ఎత్తున ప్రభుత్వ కాంట్రాక్టులను కట్టబెట్టారనే ఆరోపణలపై సీబీఐ (CBI) ప్రాథమిక విచారణకు సుప్రీంకోర్టు ఇవాళ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది సోమవారం ఆదేశించింది. మొత్తం అక్రమాలపై ప్రాథమిక విచారణ జరిపి 16 వారాల్లోపు నివేదికను సమర్పించాలని సీబీఐని జస్టిస్ విక్రమ్ నాథ్ (Justice Vikramnath) నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. విచారణకు సంబంధించిన ఎలాంటి రికార్డులు ధ్వంసం కాకుండా చూడాలని అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని (Chief Secretary) కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే గడిచిన పదేళ్లలో ఖండూ బంధువుల సంస్థలకు దక్కిన ప్రతి వర్క్ ఆర్డర్‌ను సీబీఐ క్షుణ్ణంగా పరిశీలించనుంది. రాష్ట్ర పోలీసులు ఈ కేసును నిష్పక్షపాతంగా విచారించలేరని, కాబట్టి స్వతంత్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐతో విచారణ జరిపించడం అవసరమని కోర్టు అభిప్రాయపడింది. ఈ పరిణామం అరుణాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
రూ.1,270 కోట్ల గోల్‌మాల్..?
సీఎం పెమా ఖండూ తన భార్య, తల్లి, సోదరులకు చెందిన సంస్థలకు సుమారు రూ.1,270 కోట్ల రూపాయల విలువైన పబ్లిక్ వర్క్స్ కాంట్రాక్టులను నిబంధనలకు విరుద్ధంగా కేటాయించారని సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ (Prashant Bhushan) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో 2015 నుంచి 2025 మధ్య కాలంలో జరిగిన వివిధ రకాల కాంట్రాక్టుల కేటాయింపులపై లోతైన విచారణ జరగాలని ధర్మాసనం పేర్కొంది.






