- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ఓట్లు ఎందుకు తొలగించారో చెప్పండి.. ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
బిహార్ ఓటర్ జాబితా(Bihar Voter List)పై సుప్రీంకోర్టు(Supreme Court) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: బిహార్ ఓటర్ జాబితా(Bihar Voter List)పై సుప్రీంకోర్టు(Supreme Court) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తొలగించిన ఓటర్ల పేరు ప్రకటించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. మొత్తం 65 లక్షల ఓటర్ల పేర్లు వెబ్‌సైట్‌లో పేర్కొనాలని చెప్పింది. అసలు ఎందుకు తొలగించవలసి వచ్చిందో 48 గంటల్లో పూర్తి వివరాలతో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, బిహార్‌లో ఓటరు జాబితా నుంచి దాదాపు 65 లక్షల మంది ఓటర్లను తొలగించామని పేర్కొంటూ ఇటీవల ఎన్నికల సంఘం ముసాయిదా విడుదల చేసింది. దాంతో ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు అన్నీ ఆరోపిస్తున్నాయి. గుజరాత్ వ్యక్తులు బిహార్‌లో ఓటర్లుగా మారుతున్నారని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆరోపించారు. ఈ ఆరోపణలను ఇప్పటికే బీజేపీ తిప్పికొడుతోంది. తాజాగా దీనిలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.






