- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీప్‌ఫేక్.. ఏఐ దుర్వినియోగంపై సుప్రీంకోర్టు సీజేఐ కీలక వ్యాఖ్యలు
డీప్‌ఫేక్.. ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు దీని బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: డీప్‌ఫేక్.. ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు దీని బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా సైబర్ నేరాలకు డీప్ ఫేక్ ను ఉపయోగించుకున్నారు. వాయిస్ క్లోనింగ్, చాట్ బాట్ ఫిషింగ్ టూల్స్, యాప్స్ వాడి అనేకమంది నుంచి డబ్బు దోచుకున్నారు. తాజాగా ఈ డీప్ ఫేక్ పై సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ బీ.ఆర్.గవాయ్ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై కూడా ఏఐ దుర్వినియోగం పెరుగుతుండటంతో సీజేఐ ఆందోళన చెందారు. ఈ విషయంలో లాయర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
నార్మల్ ఏఐకి, జెన్ ఏఐకి చాలా తేడా ఉందని, జెన్ ఏఐ ఉనికిలో లేని చట్టాలను కూడా రూపొందిస్తుందని న్యాయవాది కార్తికేయ రావల్ దాఖలు చేసిన పిటిషన్ లో తెలిపారు. ఫలితంలో న్యాయవ్యవస్థలో అస్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. జనరేటివ్ ఏఐ వాడకాన్ని నియంత్రించేలా మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశాలివ్వాల్సిందిగా ఆయన సుప్రీంకోర్టును కోరారు. ఈ పిటిషన్ విచారణ చేపట్టిన సీజేఐ.. సోషల్ మీడియాలో తమ డీప్ ఫేక్ ఫొటోలు సైతం ఉండటం చూసి ఆందోళన చెందినట్లు తెలిపారు. ఈ కేసుపై విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.






