- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Supreme Court: సుప్రీంకోర్టులో తమిళనాడు డిప్యూటీ సీఎంకు బిగ్ రిలీఫ్
డీఎంకే నేత, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ (Udaynidhi Stalin)కు బిగ్ రిలీఫ్ దక్కింది. ఆయనపై కొత్తకేసులేవీ నమోదు చేయకుండా సుప్రీంకోర్టు(Supreme Court) ఊరట కల్పించింది.

దిశ, నేషనల్ బ్యూరో: డీఎంకే నేత, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ (Udaynidhi Stalin)కు బిగ్ రిలీఫ్ దక్కింది. ఆయనపై కొత్తకేసులేవీ నమోదు చేయకుండా సుప్రీంకోర్టు(Supreme Court) ఊరట కల్పించింది. సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలకు గానూ కొత్త కేసులు ఏవీ నమోదు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. కాగా, ‘సనాతన ధర్మం’ (Sanatana Dharma)పై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన కామెంట్లను హిందూ సంఘాలు సహా పలువురు తీవ్రంగా తప్పుబట్టారు. ఆయన వ్యాఖ్యలపై దేశావ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అనేక ఎఫ్‌ఐఆర్‌లు కూడా నమోదయ్యాయి. ఇదే అంశంలో బిహార్‌లో ఇదే అంశంపై మరో కేసు నమోదైంది. దీంతో ఉదయనిధి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వివిధ రాష్ట్రాల్లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌లను ఏకీకృతం చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసులో కోర్టు అనుమతి లేకుండా ఉదయనిధి స్టాలిన్‌పై కొత్త కేసులు ఏవీ నమోదు చేయొద్దని ఆదేశించింది.
సనాతన ధర్మంపై కామెంట్స్
2023లో చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ ప్రసంగించారు. ఆ సమయంలో ‘సనాతన ధర్మం (Sanatana Dharma) డెంగీ, మలేరియా లాంటిది. దాన్ని నిర్మూలించాలి’ అంటూ ఉదయనిధి వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. దీనిపైన పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే, ఉదయనిధి మాత్రం తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని.. ఈ విషయంలో క్షమాపణలు చెప్పేదే లేదని తేల్చి చెప్పారు. దీంతో, ఆయనపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి.






