- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Supreme Court : సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తులు బహిర్గతం.. సీజేఐ ప్రాపర్టీస్ ఎన్నంటే?
న్యాయవ్యవస్థలో పారదర్శకతను పెంపొందించడానికి గత నెల 1న ఆమోదించబడిన కోర్టు తీర్మానాన్ని అనుసరించి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆస్తుల వివరాలను వెల్లడించారు.

దిశ, నేషనల్ బ్యూరో: న్యాయవ్యవస్థలో పారదర్శకతను పెంపొందించడానికి గత నెల 1న ఆమోదించబడిన కోర్టు తీర్మానాన్ని అనుసరించి సుప్రీంకోర్టు (Suprem court) న్యాయమూర్తులు తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఈ మేరకు కోర్టు వెబ్ సైట్‌లో ఆప్ లోడ్ చేశారు. 33 మంది న్యాయమూర్తులకు గాను 21 మంది వివరాలు పొందుపర్చారు. దీని ప్రకారం.. సీజేఐ సంజీవ్ ఖన్నా (Sanjeev khanna) కు సౌత్ ఢిల్లీలో ప్లాట్ ఉండగా, కామన్వెల్త్ గేమ్స్ విలేజ్‌లో 2,446 చదరపు అడుగుల విస్తీర్ణంలో అపార్ట్‌మెంట్, రూ.55.75 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్స్ సహా ఇతర ఆస్తులు ఉన్నాయి. అలాగే కాబోయే సీజేఐ జస్టిస్ గవాయ్ కు రూ.19.63లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, మహారాష్ట్రలోని అమరావతిలో వారసత్వంగా వచ్చిన ఇల్లు, ముంబైలోని బాంద్రా, ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీలలో అపార్ట్‌మెంట్లు, అమరావతి, నాగ్‌పూర్‌లలో వ్యవసాయ భూములు ఉన్నట్టు పేర్కొన్నారు. కాగా, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంటి నుంచి నగదు రికవరీ వివాదం తర్వాత ఆస్తుల వివరాలు వెల్లడించాలని అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.






