- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ వాయుకాలుష్యంపై సుప్రీంకోర్టు విచారం.. ఆటల పోటీలపై CAQMకు ప్రత్యేక సూచనలు
చాందినీ చౌక్, DTU, ఆనంద్ విహార్, ముండ్క, నరేలా, వాజీపూర్ లలో గాలినాణ్యత తీవ్రంగా క్షీణించినట్లు తెలిపింది. ఈ క్రమంలో నవంబర్, డిసెంబర్ నెలల్లో నగరంలోని

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకీ క్షీణిస్తుండటంపై సుప్రీంకోర్టు విచారం వ్యక్తం చేసింది. సెంట్రల్ పొల్యూషన్ బోర్డ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో తాజాగా గాలినాణ్యత 400 పాయింట్లకు పైగా నమోదయింది. చాందినీ చౌక్, DTU, ఆనంద్ విహార్, ముండ్క, నరేలా, వాజీపూర్ లలో గాలినాణ్యత తీవ్రంగా క్షీణించినట్లు తెలిపింది. ఈ క్రమంలో నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎన్సీఆర్ పరిధిలోని పలు స్కూళ్లలో జరగాల్సి ఉన్న స్పోర్ట్స్, అథ్లెటిక్స్ పోటీలను వాయిదా వేసేలా ఆయా స్కూళ్లకు ఆదేశాలివ్వాలని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సూచనలు చేసింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్ల ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది. సీనియర్ న్యాయవాది అపరాజిత సింగ్.. స్పోర్ట్స్, అథ్లెటిక్స్ ఈవెంట్ల నిర్వహణ విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటికే పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని, ఈ సమయంలో ఆటల పోటీలు నిర్వహించడం అంటే గ్యాస్ చాంబర్లలో ఉంచడం లాంటిదేనని అభిప్రాయపడ్డారు. దీనిపై మధ్యాహ్నం ఢిల్లీ హైకోర్టు ముందుకు కూడా ఇదే ఉపశమనం కోరుతూ పిటిషన్ రాబోతుందని, హైకోర్టు ధర్మాసనం అందుకు తగిన ఆదేశాలు జారీ చేయవచ్చునని సుప్రీం ధర్మాసనం తెలిపింది.






