ఢిల్లీ ప్రజలకు సుప్రీంకోర్టు శుభవార్త.. పర్యావరణ రహిత పటాకులు కాల్చుకునేందుకు అనుమతి

by Malleboina Mahesh |

దేశ రాజధాని అయిన ఢిల్లీ పట్టణంలో అనేక సంవత్సరాలుగా.. పటాకులపై నిషేధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఢిల్లీ ప్రజలకు సుప్రీంకోర్టు శుభవార్త.. పర్యావరణ రహిత పటాకులు కాల్చుకునేందుకు అనుమతి
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని అయిన ఢిల్లీ పట్టణం (Delhi city)లో అనేక సంవత్సరాలుగా.. పటాకులపై నిషేధం (Ban on firecrackers) కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రతి సంవత్సరం దేశంలోని అన్ని నగరాలు పటాకులు కాల్చుకొని సంబరాలు చేసుకుంటే.. వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీ ప్రజలు మాత్రం ఆ సంబరాలకు దూరంగా ఉంది. కాగా తాజాగా సుప్రీంకోర్టు (Supreme Court) ఢిల్లీ ప్రజలకు శుభవార్తను అందించింది. దీపావళి పండుగను సురక్షితంగా, పర్యావరణ హానిని తగ్గిస్తూ జరుపుకునేందుకు సుప్రీంకోర్టు ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో ఆకుపచ్చ (Green) బాణసంచా కాల్చడానికి మోడరేట్ అనుమతులు ఇచ్చింది.

కోర్టు నిర్ణయం ప్రకారం, అక్టోబర్ 18 నుంచి అక్టోబర్ 21 వరకు ఎకో ఫ్రెండ్లీ బాణసంచా (Eco-friendly fireworks) కాల్చడానికి వీలుగా ఏర్పాటు చేయబడింది. దీపావళి రోజున కూడా ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, అలాగే రాత్రి 8 నుంచి రాత్రి 10 గంటల వరకు బాణ సంచాకు కోర్టు అనుమతించింది. సుప్రీంకోర్టు ప్రజలను పర్యావరణంతో రాజీపడకుండా, మితంగా, సమతుల్య విధానంలో బాణసంచా వినియోగించమని సూచించింది. ఇందుకు ఎకో ఫ్రేండ్లీగా తయారు చేయబడి, QR కోడ్‌లతో గుర్తింపు పొందిన ఉత్పత్తులను మాత్రమే విక్రయించేలా, పోలీసు బృందాల ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది.

కోర్టు నిబంధనల ప్రకారం, బయటి నుంచి బాణసంచా తీసుకురావడం కచ్చితంగా నిషేధించబడింది. అలాగే నకిలీ ఉత్పత్తులు దొరికిన సందర్భంలో లైసెన్స్ సస్పెండ్ చేయడానికి అధికారులకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఈ నిర్ణయం ద్వారా, ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలోని కుటుంబాలు, చిన్నపిల్లలు సురక్షితంగా, శాంతియుతంగా దీపావళి పండుగను ఆస్వాదించగలరని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే కోర్టు నిర్ణయంపై ఢిల్లీ సీఎం రేఖ గుప్తా (Delhi CM Rekha Gupta) హర్షం వ్యక్తం చేశారు.

Next Story