సానుభూతితో తీర్పు మార్చలేం.. మరోసారి ప్రభుత్వ ఉద్యోగులకు సుప్రీంకోర్టు షాక్

by Ajay Maddhiboyina |

ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ పై సుప్రీంకోర్టు మరోసారి కీలక తీర్పునిచ్చింది. సర్వీస్ లో ఉన్న టీచర్లకు టెట్ తప్పని అంటూ 2025 సెప్టెంబర్ లో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని దాఖలైన 70 రివ్యూ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.

సానుభూతితో తీర్పు మార్చలేం.. మరోసారి ప్రభుత్వ ఉద్యోగులకు సుప్రీంకోర్టు షాక్
X

దిశ, వెబ్ డెస్క్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ పై సుప్రీంకోర్టు మరోసారి కీలక తీర్పునిచ్చింది. సర్వీస్ లో ఉన్న టీచర్లకు టెట్ తప్పని అంటూ 2025 సెప్టెంబర్ లో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని దాఖలైన 70 రివ్యూ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. సర్వీస్ లో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులంతా తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణత సాధించాల్సిందేనని స్పష్టం చేసింది. దీని నుండి ఎలాంటి మినహాయింపులు ఉండవని తేల్చిచెప్పింది. కానీ మానవీయ కోణంలో ఆలోచించి టెట్ పాస్ అవ్వడానికి మరో ఏడాది గడువు పెంచుతూ ఉపాధ్యాయులకు కాస్త ఉపశమనం కల్పించింది.

ఉపాధ్యాయులు తమ ఉద్యోగంలో కొనసాగాలి అన్నా, పదోన్నతులు పొందాలి అన్నా 2028 ఆగస్టు 31లోపు టెట్ అర్హత సాధించాలని పేర్కొంది. వివిధ రాష్ట్రాలు, ఉపాధ్యాయ సంఘాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను తిరస్కరించింది. పాఠశాలల్లో నాణ్యత నిర్వహణకు టెట్ తప్పని సరి అని, పిల్లల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయుల సేవలు రాజీపకూడదని తెలిపింది. టెట్ రాజ్యాంగపరమైన అవసరం అని పిల్లలకు నాణ్యమైన విద్యాహక్కు అని పేర్కొంది. ఉపాధ్యాయులు ఇబ్బంది పడతారని సానుభూతితో తీర్పు మార్చలేమని స్పష్టం చేసింది. రైట్ టూ ఎడ్యూకేషన్ యాక్ట్ ప్రకారం అందరు ఉపాధ్యాయులు టెట్ అర్హత తప్పనిసరిగా పొందాలని చెప్పింది.

Next Story