- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Supreme court: సుప్రీంకోర్టు చరిత్రలో కొత్త అధ్యాయం.. కోర్టు ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ అమలు
సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. న్యాయస్థానంలో తొలిసారిగా రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది.

దిశ, నేషనల్ బ్యూరో: సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. న్యాయస్థానంలో తొలిసారిగా రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. కోర్టులోని సిబ్బంది నియామకాలు, పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను అమలు చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ తరహా విధానాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం ఇదే తొలిసారి. సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ మేరకు గత నెల 24నే సుప్రీంకోర్టు సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం.. జూన్ 23 నుంచే ఈ పాలసీ అమల్లోకి వచ్చింది. ఈ పాలసీ ప్రకారం కోర్టుల నియామకాలు, ప్రమోషన్ల ద్వారా భర్త చేసే పోస్టుల్లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది.
అయితే ఈ రిజర్వేషన్లు పరిపాలనా, సహాయక సిబ్బంది స్థానాలకు మాత్రమే వర్తిస్తాయి. న్యాయమూర్తులకు ఇది వర్తించబోదని అత్యన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కోర్టులోని రిజిస్ట్రార్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, జూనియర్ కోర్ట్ అసిస్టెంట్, జూనియర్ కోర్ట్ అటెండెంట్, చాంబర్ అటెండెంట్ సహా ఇతర పోస్టులకు వర్తించనుంది. ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని అమలు చేయడంలో సీజేఐ గవాయ్ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది.






