Supreme court: 498ఏ వరకట్న వేధింపులకు మాత్రమే పరిమితం కాదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

by B.Srinivas |

ఐపీసీ 498ఏ ప్రకారం చర్యలు తీసుకోవడానికి వరకట్నం డిమాండ్ అవసరం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

Supreme court: 498ఏ వరకట్న వేధింపులకు మాత్రమే పరిమితం కాదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఐపీసీ 498ఏ ప్రకారం చర్యలు తీసుకోవడానికి వరకట్నం డిమాండ్ అవసరం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భర్త క్రూరత్వాన్ని ఆరోపించడానికి వరకట్నం గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదని, హింసకు పాల్పడినా కూడా వారిపై ఈ సెక్షన్ కింద చర్యలు తీసుకోచ్చని తెలిపింది. ఐపీసీలోని సెక్షన్ 498ఎ ప్రాథమికంగా క్రూరత్వానికి సంబంధించినదని, వరకట్నం సమస్య దానిపై ఏ విధంగానూ ప్రభావం చూపబోదని స్పష్టం చేసింది. దీని అమలుకు వరకట్నం డిమాండ్ లేకపోవడం తప్పనిసరి షరతు కాదని పేర్కొంది. ఈ మేరకు వరకట్నం డిమాండ్ చేయనుందున ఓ వక్తిపై దాఖలైన సెక్షన్ 498ఏ కేసును రద్దు చేస్తూ ఆంద్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ప్రసన్న బీ వరాలేలతో కూడిన ధర్మాసనం రద్దు చేసింది.

సెక్షన్ 498ఏ ఉద్దేశం కేవలం వరకట్నం డిమాండ్ కారణంగా జరిగే వేధింపుల నుంచి రక్షించేందుకు మాత్రమే కాదని తెలిపింది. గృహ హింస, ఇతర క్రూరమైన చర్యల నుంచి మహిళలను రక్షించడమే దీని లక్ష్యమని వెల్లడించింది. శారీరక, మానసిన హింసలు కూడా దీని పరిధిలోకి వస్తాయని వ్యాఖ్యానించింది. కాగా, ఓ వ్యక్తిపై తన భార్య సెక్షన్ 498A ప్రకారం కేసు నమోదు చేయగా ఆమెను కట్నం కోసం వేధించలేదని పేర్కొంటూ నిందితుడు ఏపీ హైకోర్టును ఆశ్రయించాడు. సెక్షన్ 498A ప్రకారం కింద నేరంగా పరిగణించబడదని పేర్కొంటూ కోర్టు కేసును రద్దు చేసింది. అనంతరం బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా విచారణ చేపట్టిన న్యాయస్థానం పై వ్యాఖ్యలు చేసింది.

Next Story