- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
suprem Court: సావర్కర్ పై కామెంట్స్.. రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు సీరియస్
సావర్కర్ ను ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది.

దిశ, డైనమిక్ బ్యూరో: స్వాతంత్య్ర సమరయోధులను అపహస్యం చేయవద్దని లోక్ సభలో ప్రతిపక్ష నాయకులు, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారం హెచ్చరించింది. సావర్కర్ ను (Savarkar) ఉద్దేశించి గతంలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలను కొనసాగిస్తే పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఇవే తరహా వ్యవహరిస్తే మేమే స్వయంగా విచారణ చేపడతామని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్ లతో కూడిన ధర్మాసనం మండిపడింది. సావర్కర్ ఆంగ్లేయుల సర్వెంట్ అని, సావర్కర్ బ్రిటిష్ వారి నుండి పెన్షన్ పొందారని 2022 లో రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రలో ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై న్యాయవాది నృపేంద్ర పాండే లక్నో మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించగా 12 డిసెంబర్ 2024న లక్నో మెజిస్ట్రేట్ కోర్టు రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. ఈ సమన్లను రాహుల్ గాంధీ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేయగా ట్రయల్ కోర్టు ఇచ్చిన సమన్లను రద్దు చేయాడానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో హైకోర్టు తీర్పుపై రాహుల్ గాంధీ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆ ఫిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది.
మీ క్లయింట్ కు ఈ విషయం తెలుసా?
విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సావర్కర్ ను మహారాష్ట్ర ప్రజలు ఎంతో గౌరవం ఇస్తారు. ఇప్పుడు మీరు సావర్కర్ ను బ్రిటీష్ వారి సేవకుడు అని అంటారు. తర్వాత మరెవరో మహాత్మగాంధీ బ్రిటీషర్స్ కు సర్వెంట్ అంటారు. మన స్వాతంత్య్ సమర యోధులకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయడానికి మేము ఎవరికి అనుమతి ఇవ్వం అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మహాత్మ గాంధీ కూడా బ్రిటీష్ వారితో 'మీ నమ్మకమైన సేవకుడిని' అనే పదాలను ఉపయోగించారని మీ క్లంయిట్ కు తెలుసా? మీ క్లయింట్ నానన్న ఇందిరా గాంధీ కూడా ఆ స్వాతంత్ర్య సమరయోధుడిని ప్రశంసిస్తూ లేఖ పంపిందని తెలుసా? అని రాహుల్ గాంధీ తరఫున విచారణకు హాజరైన కాంగ్రెస్ నాయకులు, లాయర్ అభిషేక్ సింగ్వీని కోర్టు ప్రశ్నించింది. వారు మనకు స్వేచ్ఛను ప్రసాదించారు. సావర్కర్ విషయంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం అని మరోసారి ఈ తరహా వ్యాఖ్యలు రిపీట్ చేయవద్దని హెచ్చరించింది. చట్టం గురించి మీకు మంచి అభిప్రాయం ఉన్నందునా మెటిజిస్ట్రేట్ కోర్టు జారీ చేసిన సమన్లపై సుప్రీంకోర్టు స్టే ఇస్తున్నట్లు కోర్టు తెలిపింది.






