Triple Talaq : సంభాల్ అల్లర్లలో పోలీసులకు సపోర్ట్.. భార్యకు ట్రిపుల్ తలాక్

by Sathputhe Rajesh |

సంభాల్ హింస సందర్భంగా పోలీసుల చర్యను సమర్ధించిన భార్యకు భర్త ట్రిపుల్ తలాక్ ఇవ్వడం సంచలనంగా మారింది.

Triple Talaq : సంభాల్ అల్లర్లలో పోలీసులకు సపోర్ట్.. భార్యకు ట్రిపుల్ తలాక్
X

దిశ, నేషనల్ బ్యూరో : సంభాల్ హింస సందర్భంగా పోలీసుల చర్యను సమర్ధించిన భార్యకు భర్త ట్రిపుల్ తలాక్ ఇవ్వడం సంచలనంగా మారింది. ఈ ఘటన యూపీ మొరాదాబాద్‌లో ఆదివారం వెలుగు చూసింది. బాధితురాలు నిదా తెలిపిన వివరాల ప్రకారం.. ‘పని మీద సంభాల్ వెళ్లే ముందు అక్కడి పరిస్థితి గురించి తెలుసుకోవడానికి ఇంటర్నెట్‌లో ఓ వీడియో చూశాను. నా భర్త వీడియో చూడకుండా అడ్డుకుని పోలీసులను విమర్శించాడు. తమను తాము రక్షించుకునే హక్కు పోలీసులకు ఉందని చెప్పడంతో నాపై అరవడం ప్రారంభించి.. నన్ను ‘కాఫిర్’ అన్నాడు. నాతో ఉండటం ఇష్టం లేదని ట్రిపుల్ తలాక్ చెప్పాడు.’ అని వాపోయింది. ‘నాకు నలుగురు పిల్లలు ఉన్నారు. ఐదేళ్ల బాబు ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. నా భర్త బాబును పట్టించుకోవడం లేదు. కుటుంబ పోషణను సైతం గాలికి వదిలేశాడు.’ వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని భార్య డిమాండ్ చేసింది. సుప్రీం కోర్టు ట్రిపుల్ తలాక్‌ను రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. రెండేళ్ల తర్వాత కేంద్రం 2019లో పార్లమెంట్‌లో చట్టం చేసి భారత్‌లో దీన్ని రద్దు చేసింది.

Next Story