మా మిల్లెట్స్ కూడా ట్రై చేయండి: బిల్ గేట్స్‌ను కోరిన ప్రధాని మోడీ

by Disha Web Desk 7 |
మా మిల్లెట్స్ కూడా ట్రై చేయండి: బిల్ గేట్స్‌ను కోరిన ప్రధాని మోడీ
X

న్యూఢిల్లీ: బిలియనర్, వ్యాపారవేత్త బిల్ గేట్స్‌పై ప్రధాని మంత్రి ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా బిల్ గేట్స్ అమెరికన్ చెఫ్‌తో కలిసి చపాతీ తయారు చేసిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంపై మోడీ తనదైన రీతిలో స్పందించారు. ప్రస్తుతం భారత్‌లో ఆరోగ్యవంతమైన మిల్లెట్స్ ట్రెండ్ నడుస్తుందని, వీటిని కూడా ట్రై చేయండి అని బిల్ గేట్స్‌ను శనివారం కోరారు. తాజాగా భారత్ ప్రతిపాదన మేరకు ఐక్యరాజ్యసమితి 2023 ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. కాగా, చిరు ధాన్యాల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉంది.



Next Story

Most Viewed